AP: భారీగా పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల ( Ap corona cases ) సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. గత 24 గంటల్లో ఏకంగా 6 వేల 45 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ( Ap Health Department ) తాజాగా విడుదల చేసిన బుల్లెటిన్ గణాంకాలు భయపెడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఇప్ప్పటివరకూ 64 వేల 713 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఒక్కసారిగా 6 వేల 45 కొత్త కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేసింది. అయితే గత 24 గంటల్లో చేసిన కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షల ( Covid19 Tests ) సంఖ్య కూడా రికార్డు స్థాయిలోనే ఉంది. ఒక్కరోజులో 49 వేల 553 పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 6 వేల 45 మంది డిశ్చార్జ్ కాగా...ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 32 వేల 127కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 31 వేల 763 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా 823 మంది మృతి చెందారు. ఇప్పటివరకూ ఏపీలో రికార్డు స్థాయిలో 14 లక్షల 35 వేల 827 శాంపిల్స్ ను పరీక్షించారు.
ఓ వైపు పరీక్షల సామర్ధ్యాన్ని పెంచుతూనే కోవిడ్ 19 నియంత్రణకు చర్యలు కూడా తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్ ( Largest Covid care centre ) ను యుద్దప్రాతిపదికన నిర్మిస్తోంది. Also read: AP Cabinet: ఏపీ కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం