AP RGUKT 2021 Results:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ(IIIT) కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఆర్జీయూకేటీ సెట్‌-2021 పరీక్ష ఫలితాలు(AP RGUKT 2021 Results) విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్(Audimulapu Suresh) బుధవారం ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ఫలితాలను విడుదల చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత నెల 26న ఆర్జీయూకేటీ సెట్‌ పరీక్ష(RGUKT Cet Exam) నిర్వహించారు. అయితే ఏపీ విద్యాశాఖ రికార్డు సమయంలో 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం. అయితే.. ఫలితాల విడుదల కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, సెట్ బాధ్యులు పాల్గొన్నారు.


తొలి ఐదు స్థానాలు..
1. ఎం. గుణశేఖర్‌ (ధర్మవరం, అనంతపురం జిల్లా)
2. కె. శ్రీచక్రధరణి ( మైదుకూరు, వైఎస్సార్‌ కడప జిల్లా)
3. ఎం. చంద్రిక (విజయనగరం జిల్లా)
4. వెంకటసాయి సుభాష్‌ (జమ్మలమడుగు, వైఎస్సార్‌ కడప జిల్లా)
5. జి. మనోజ్ఞ (మండపేట, తూర్పు గోదావరి జిల్లా)


Also Read: APPSC Recruitment 2021: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్: 151 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


ఫలితాలను చూసుకోండి ఇలా..
మెుదటగా rgukt.in  వైబ్ సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్‌పేజీలో ‘'RGUKT CET 2021' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
అభ్యర్థులు వ్యక్తిగత వివరాలు.. పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత ఫలితం, ర్యాంక్ కార్డు కనిపిస్తుంది. దానిని ప్రింట్ తీసుకోవాలి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook