AP Schools Latest News, Andhra Pradesh Education AP rules out closure of schools due to Covid cases rise : ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయినప్పటికీ పాఠశాలలను మూసే వేసే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (AP Education Minister Adimulapu Suresh) వెల్లడించారు. ఏపీలో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం పొడిగించలేదనే విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా (Corona) నేపథ్యంలో తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తారని ప్రజలు భావించారు. కానీ సెలవులను పొడిగింపు ఆలోచన లేదని ప్రకటించిన విధంగానే యధావిధిగా పాఠశాలలు నడుస్తాయంటూ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చెప్పిన విషయం తెలిసిందే. 


అయితే ప్రస్తుతం కోవిడ్ (Covid) విజృంభిస్తోన్న నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపే విషయంతో కాస్త ఆందోళన చెందుతున్నారు. దీంతో హాజరుశాతం తక్కువగా నమోదు అవుతోంది. కాగా విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా పాఠశాలలను ఆఫ్‌లైన్‌లో కొనసాగిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) అన్నారు. 


కొవిడ్ దృష్ట్యా గతంలో అందరినీ పాస్‌ (all pass) చేసే విధానాన్ని కొనసాగించామని అయితే దాని వల్ల వచ్చిన సమస్యలను అర్థం చేసుకున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను యధావిధిగా నడపాలని నిర్ణయించిందని మంత్రి సురేష్ చెప్పారు.


ఇక ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు వారి భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందంటూ మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియ పూర్తయిందని, 15 నుంచి 18 ఏళ్ల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిందంటూ మంత్రి పేర్కొన్నారు.


Also Read : Hyderabad: తెలంగాణ పోలీసులపై కరోనా పంజా..భారీ సంఖ్యలు కేసులు నమోదు!


అలాగే విద్యార్థుల ఆరోగ్య భద్రతపై కూడా నిఘా ఉంచామన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూనే పాఠశాలలను నడిపిస్తామన్నారు. ఈ విషయంలో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి (Minister) పేర్కొన్నారు. ఇప్పటికైతే పాఠశాలలను మూసివేసే ఆలోచన లేదని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా కోవిడ్ కేసులు (Covid cases) భారీగా పెరుగుతుండడం వల్ల తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆఫ్‌లైన్ తరగతులు జరగడం లేదు.


Also Read : AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 6,996 కరోనా కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook