Ap Sec Nimmagadda Ramesh kumar: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇవాళ పదవీ విరమణ చేయబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ సహకారం, అధికారుల కృషితో సజావుగా జరిగాయని ప్రశంసించారు. ఎక్కడా రీ పోలింగ్ అవకాశం లేకుండా ప్రశాంతంగా సాగాయని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ (Nimmagadda Ramesh kumar)ఇవాళ అంటే మార్చ్ 31వ తేదీన పదవీ విరమణ (Sec Retirement) చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం, మీడియా, అధికారులపై ప్రశంసలు కురిపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం నుంచి తనకు పూర్తి సహకారం లభించిందని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. ప్రజల నుంచి, మీడియా ద్వారా అపూర్వ సహకారం అందిందన్నారు. తనకు అందించిన సహకారం ఎంతో విలువైనదని, ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహించడం సంతృప్తి కలిగించిందన్నారు. ఎక్కడా రీపోలింగ్‌కు అవకాశం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపామని, అధికారులు సిబ్బంది ఎంతో నిబద్దతతో పనిచేసి ఎన్నికలు సజావుగా నిర్వహించారని ప్రశంసించారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిందని, ప్రభుత్వ సాయంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు.


సీఎస్, డీజీపీ సహా కలెక్టర్లు ఎస్పీలు పూర్తిగా సహకరించారని.. రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా జరపాలని హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. తమ బాధ్యతలు నిర్వహించడంలో హైకోర్టు (High Court) సంపూర్ణ సహకారం అందించిందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని..చట్ట సభల పట్ల పూర్తి విశ్వాసం ఉండాల్సిందేనని తెలిపారు. వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన మంచి పద్దతి అమల్లో ఉందన్నారు. అన్నింటినీ నివేదిక రూపంలో క్రోడీకరించి వాటిని అమలు చేయాలని గవర్నర్‌కు నివేదిక అందిస్తానన్నారు. తన వారసురాలిగా నీలం సాహ్ని ఎస్ఈసీగా బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. ఎస్ఈసీ నీలం సాహ్ని( New Sec Neelam Sahni) కి అభినందనలు తెలియజేశారు.


Also read: AP SEC: నిమ్మగడ్డకు నో అప్పాయింట్మెంట్, తీవ్ర నిరాశలో ఎస్ఈసీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook