AP SEC Nimmagadda Ramesh Kumar: గత కొన్ని రోజులుగా ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల పనులతో బిజీబిజీగా ఉన్నారు. తాజాగా నేడు కొన్ని జిల్లాల్లో తన పర్యటనను ఏపీ ఎలక్షన్ కమిషనర్ తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. తొలుత కడప జిల్లాలో నిమ్మగ్డడ రమేష్ కుమార్ పర్యటించాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కంటి ఇన్‌ఫెక్షన్‌ కారణంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేటి తన పర్యటనల్ని రద్దు చేసుకున్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. గత కొన్ని రోజులుగా ఎన్నికల పనుల పర్యవేక్షణతో బిజీగా గడిపిన నిమ్మగడ్డ రమేష్ కుమార్(Nimmagadda Ramesh Kumar) కొంత విరామం తీసుకుని కంటికి వైద్య చికిత్స చేయించుకుంటున్నారు.


Also Read: AP Panchayat Elections 2021: పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై AP SEC చర్యలు, నివేదిక కోసం ఆదేశాలు


 


తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. కంటి పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన క్రమంలో తన పర్యటనల్ని రద్దు చేసుకున్నారు. అయితే ఏపీ పంచాయతీ ఎన్నికల(AP Panchayat Elections 2021) ఏర్పాట్లు, నామినేషన్ల విషయాలను అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎస్ఈసీ తీసుకొచ్చిన ఈ వాచ్ యాప్‌ను ఫిబ్రవరి 9వరకు వాడకూడదని రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఆదేశించింది.


Also Read: AP Panchayat Elections 2021: ఈ-వాచ్ యాప్‌ ఆవిష్కరించిన ఏపీ ఎస్ఈసీ, E-Watch Appపై ఊహించని షాక్ 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook