Ap panchayat elections 2021: ఆంధ్రప్రదేశ్ లో రెండవ దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగుదశల్లో జరగనున్న పంచాయితీపోరులో ఇప్పటికే తొలిదశ ముగిసింది. రెండవ దశలో 2 వవేల 786 పంచాయితీలకు పోలింగ్ జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ పంచాయితీ పోరు ( Ap panchayat elections )లో రెండో అంకం పూర్తి కావస్తోంది. రెండవ దశ పోలింగ్ ఇవాళ ప్రారంభమంది. రాష్ట్రంలో రెండవ దశలో 3 వేల 328 పంచాయితీ గ్రామ పంచాయితీలకు నోటిఫికేషన్ వెలువడగా..539 పంచాయితీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి ( Unanimous Panchayats ). మిగిలిన 2 వేల 786 పంచాయితీలకు పోలింగ్ ఇవాళ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైంది. మద్యాహ్నం 3.30 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల్నించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సర్పంచి స్థానాలకు 7 వేల 507 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత గ్రామాల్లో 33 వేల 570 వార్డులుండగా 12 వేల 604 ఏకగ్రీవమయ్యాయి. 149 వార్డులలో నామినేషన్లు దాఖలు కాలేదు. దాంతో  20 వేల 817 వార్డులకు 44 వేల 876 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 


రెండవ దశ పంచాయితీ ఎన్నికల ( Second phase panchayat elections polling ) పోలింగ్ ఉదయం నుంచి ప్రశాంతంగా జరుగుతోంది. సమస్యాత్మక పోలింగ స్టేషన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటయ్యాయి. ప్రతి మండలానికో డీఎస్పీని నియమించి పర్యవేక్షిస్తున్నారు. అతి సమస్యాత్మక గ్రామాల్లో ఎస్ఐ, నలుగురు కానిస్టేబుల్స్  నియమితులయ్యారు. 


Also read: Vizag bus accident: అరకు ఘాట్ రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి.. ప్రయాణికులకు గాయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook