COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరోనా వైరస్ ( Corona test ) నిర్ధారణ పరీక్షల్లో దేశంలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh ) మరో వినూత్న ప్రయోగం చేసింది. ఇకపై ఏపీ గ్రామాల్లో ఆ బస్సులు ఇంటింటికీ వెళ్లనున్నాయి. ప్రతి ఒక్కరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నాయి.


కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అగ్రగామిగా ఉంది. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan ) రానున్న మూడు నెలల్లో ఇంటింటికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఐ మాస్క్  బస్సుల్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు కొత్తగా ఏపీఎస్సార్టీసీ ( Apsrtc ) ఇంద్రబస్సుల్ని( Indra Buses ) సంజీవిని బస్సులుగా మార్చింది. ఈ సంజీవిని బస్సుల్ని కోవిడ్ 19 వైరస్ ( Covid 19 tests )  నిర్ధారణ పరీక్షల కోసం  వినియోగించనున్నారు. ఇప్పటివరకూ 21 బస్సుల్ని సిద్దం చేశారు. త్వరలో మరో 30 బస్సులు అందుబాటులో రానున్నాయి. ఈ బస్సుల్ని ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 నెలల్లో ఇంటింటికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్న సంకల్పాన్ని నెరవేర్చేందుకు  ప్రభుత్వం ఈ బస్సుల్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ చేసిన కరోనా పరీక్షలు పది లక్షల 60 వేలు దాటాయి. రోజుకు 24 వేల పరీక్షలు చేసే సామర్ద్యాన్ని కలిగి ఉన్నామని...త్వరలో మరిన్ని పరీక్షలు చేస్తామని ఏపీ వైద్య శాఖ తెలిపింది.