AP Corona Update: ఏపీలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గత కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గడంతో ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూ వేళల్లో సడలింపులు కూడా ఇచ్చింది.  గత 24 గంటల్లో ఏపీలో..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ఉధృతి ఏపీలో వేగంగా తగ్గుతోంది. కరోనా సంక్రమణ పెరగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. పెద్ద ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తూ..వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. ఫలితంగా కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 55 వేలమందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..కేవలం 2 వేల 620 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. 7 వేల 504 మంది కరోనా నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. అదే సమయంలో గత 24 గంటల్లో కరోనా కారణంగా ఏపీలో  44 మంది మరణించగా..మొత్తం మృతుల సంఖ్య 12 వేల 363కు చేరుకుంది.చిత్తూరులో అత్యధికంగా 531 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 335 కేసులు నమోదయ్యాయి.


రాష్ట్రంలో ప్రస్తుతం 58 వేల 140 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 17 లక్షల 82 వేల 680 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2 కోట్ల 12 లక్షల 5 వేల 849 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అటు మెగా వ్యాక్సిన్ డ్రైవ్(Mega Vaccine Drive)పేరుతో రాష్ట్రంలో నిన్న ఒక్కరోజులోనే 13 లక్షల మందికి వ్యాక్సిన్ వేసి రికార్డు సృష్టించారు.


Also read: Anandaiah Corona medicine: ఆనందయ్య చుక్కల మందులో హానికారక పదార్థం, రిపోర్టులో ఆశ్చర్యకర విషయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook