Badrachalam: తెలుగు రాష్ట్రాలపై వరుణుడు పంజా విసిరిడు. గతంలో ఎప్పుడు లేనట్లుగా జూలైలోనే విరుచుకుపడ్డాడు. జూలై చరిత్రలోనే ఎప్పుడు లేనంతగా గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఆల్ టైం సెకండ్ నీటిమట్టానికి చేరింది. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 72.8 అడుగులకు చేరింది. భద్రాచలం నుంచి పోలవరం మీదుగా ధవళేశ్వరం నుంచి 28 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించింది. గోదారమ్మ ఉగ్రరూపానికి భద్రాచలం సహా తెలంగాణ, ఏపీలోని వందలాది గ్రామాలు నీటమునిగాయి. ఇదే ఇప్పుడు కొత్త వివాదానికి కారణమైంది. తెలుగు రాష్ట్రాల మధ్య మంటలు పుట్టిస్తోంది. ఏకంగా విభజన సమయంలో ఏపీలో విలీనమైన గ్రామాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గోదావరి వరదలపై మాట్లాడిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు.పోలవరం ప్రాజెక్ట్ వల్లే భద్రాచలం సహా పలు గ్రామాలు జలమలం అయ్యాయని చెప్పారు. ఏపీలో విలీనం చేసిన పలు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇచ్చివేయాలన్నారు. పువ్వాడ చేసిన ఈ వ్యాఖ్యలే తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గిరాజేసింది. ఏపీ మంత్రులు, నేతలు పువ్వాడ కామెంట్లపై సీరియస్ గా స్పందిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా భద్రాచలం మునిగిపోతుందనటం హాస్యస్పదంగా ఉందన్నారు మాజీ మంత్రి పేర్నినాని. 1986లో వరదలు వచ్చినప్పుడు భద్రాచలం మునిగిందని.. అప్పుడు పోలవరం లేదు కదా అన్నారు. గోదావరిపై సరైన అవగాహన లేని పువ్వాడ అజయ్ మంత్రి ఎలా అయ్యారో? అని ప్రశ్నించారు. మంథని, ఏటూరు నాగారం ప్రాంతాలు కూడా మునిగాయని.. ఆ ప్రాంతాల్ని ఎక్కడ కలుపుతారంటూ కొత్త వాదన తీసుకొచ్చారు.


అంతేకాదు భద్రాచలం ఏపీకే చెందుతుదంటూ కొన్ని ఆధారాలు చూపించారు పేర్నినాని. 1953లో అప్పటి హైదరాబాద్ స్టేట్..  ఏపీలో కలిసిపోయే నాటికి  భద్రాచలం ఏపీలోనే ఉందని చెప్పారు. భద్రాచలంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కార్ సవితి తల్లి ప్రేమ చూపుతోందన్నార. అందుకే యాదాద్రిని వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి.. భద్రాద్రిని మాత్రం పట్టించుకోలేదన్నారు. భద్రాచలాన్ని ఏపీకి అప్పగిస్తే తాము డెవలప్ చేసి చూపిస్తామంటూ హాట్ కామెంట్స్ చేశారు పేర్నినాని. పువ్వాడ అజయ్‌ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి గొడవలు, వివాదాలు లేవని..కొత్తవి సృష్టించే ప్రయత్నం చేయొద్దన్నారు. పోలవరం ప్రాజెక్టుకు భద్రాచలానికి ముడిపెట్టడం సరైనది కాదన్నారు. గోదావరికి వరదలు వచ్చిన ప్రతిసారి రెండు రాష్టాల్లోని పలు గ్రామాలు నీట మునుగుతున్నాయన్నారు. భద్రాచలంలో వరదలు వస్తే పోలవరం ఎలా కారణమవుతుందని ప్రశ్నించారు. ఐదు గ్రామాలు ఇవ్వమంటే..భద్రాచలం తమదని అంటామని ఇస్తారా అని మండిపడ్డారు. 


భద్రాచలంలో గతంలో ఏపీలో ఉండేదని.. తమకు ఇవ్వాలంటూ పేర్నినాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 1953 ముందు భద్రాచలం ఏపీలోనే ఉండేదన్న పేర్నినాని.. యాదాద్రిలా భద్రాద్రిని ఎందుకు అభివృద్ధి చేయలేదన్న ప్రశ్నలపై జనాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. పువ్వాడ కదిలించిన తీగ ఎక్కడ వెళుతోందోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు  జనాల్లో సెంటిమెంట్ రగిలించి రాజకీయంగా క్యాష్ చేసుకునేందుకే పోలవరం, భద్రాచలం అంశాలపై రచ్చ చేస్తున్నారనే ఆరోపణలు కొన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించి పోలవరం, భద్రాచలంపై మాట్లాడారని తెలుస్తోంది. పోలవరం ఎత్తుపై పార్లమెంట్ లోనూ గులాబీ పార్టీ ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే భద్రాచలం, పోలవరం రగడ ఢిల్లీలో రచ్చ కానుంది. చూడాలి మరీ భద్రాచలం కేంద్రంగా సాగుతున్న రాజకీయం ఎటువైపు దారి తీస్తుందో...    


Read aslo : Ambati on Puvvada: భద్రాచలంలో వరదలు వస్తే పోలవరం కారణమవుతుందా..అంబటి ధ్వజం..!


Read aslo :  Rythu Bheema:తెలంగాణ రైతులకు అలర్ట్.. రైతు బీమాలో మార్పులకు ఇవాళ ఒక్కరోజే అవకాశం



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook