AP TET 2022: ఆంధ్రప్రదేశ్‌లో నేటి (ఆగస్టు 6) నుంచి టెట్ (Teacher Eligibility Test) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 వరకు టెట్ పరీక్షలు జరుగుతాయి. ఆన్‌లైన్ విధానంలో రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. టెట్ పరీక్ష నేపథ్యంలో అభ్యర్థులు పాటించాల్సిన గైడ్‌లైన్స్‌ను ఒకసారి పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అభ్యర్థులు పాటించాల్సిన గైడ్‌లైన్స్ :


అభ్యర్థులు టెట్ హాల్ టికెట్ మరిచిపోవద్దు. హాల్ టికెట్ లేకుండా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.


హాల్ టికెట్‌తో పాటు తప్పనిసరిగా ఒక ఫోటో ఐడీ ప్రూఫ్‌ను తీసుకెళ్లాలి.


మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఒకవేళ ఎవరైనా పరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌కి పాల్పడినట్లయితే చట్టరీత్యా చర్యలు తప్పవు.


ప్రతీ ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించాలి. కోవిడ్ 19 ప్రోటోకాల్‌ను పాటించాలి.


ఏపీ టెట్ పరీక్షలు ఆగస్టు 21తో ముగుస్తాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఆగస్టు 31న టెట్ ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేస్తారు. అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 7 వరకు అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 12న ఫైనల్ కీ విడుదల చేస్తారు. ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు 40 శాతం, బీసీ అభ్యర్థులకు 50 శాతం, ఓసీ అభ్యర్థులకు 60 శాతం మార్కులు వస్తే టెట్‌లో అర్హత సాధిస్తారు. టెట్ రాసేందుకు డిగ్రీలో 45 శాతం మార్కులు ఉండాలనే నిబంధనను రిజర్వేషన్ అభ్యర్థుల కోసం ఈసారి సడలించారు. బీఈడీలో ప్రవేశాలకు 40 శాతం మార్కులే అర్హత కావడంతో ఈ సడలింపునిచ్చారు.


Also Read: Shocking Love Story: షాకింగ్... ప్రేమ కోసం యువతి పిచ్చి పని.. హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించుకున్న ప్రియురాలు..


Also Read: Today Gold Price August 6: మళ్లీ పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి పసిడి ధరలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook