AP TET Results 2022: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈ టెట్ పరీక్షల్లో 58.07% మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. దీనికి నార్మలైజేషన్‌ విధానాన్ని అమలు చేశారు. అభ్యర్థులు aptet.apcfss.in వెబ్ సైట్ ద్వారా రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ టెట్ పరీక్షలు ఆగస్టు 6 నుండి 21 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ విధానంలో ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2.30 నుండి 5.00 వరకు రెండు షిఫ్టులలో జరిగాయి. అనంతరం కీ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం సెప్టెంబరు 7 వరకు కీ పై అభ్యంతరాలను స్వీకరించింది. ఈ ఏడాది టెట్‌ పరీక్షకు 4,07,329 మంది హాజరయ్యారు. 


ఏపీ టెట్ ఫలితాలు చెక్ చేసుకోండి ఇలా..
>>ముందుగా అధికారిక వెబ్ సైట్ aptet.apcfss.in లోకి వెళ్లండి
>>హోమ్‌పేజీలో AP TET 2022 Results పై క్లిక్ చేయండి
>>అనంతరం లాగిన్ అయ్యి.. అడిగిన వివరాలను నింపండి.
>>మీ రిజల్ట్ తెరపై ప్రత్యక్షం అవుతుంది. దీని ప్రింట్ అవుట్ తీసుకుని మీ వద్ద పెట్టుకోండి. 


Also Read: Krishnam raju: కృష్ణంరాజు పేరిట 2 ఎకరాల్లో స్మృతివనం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook