ఏపీలో గిరిజనుల కోసం "గిరి చంద్రన్న దీవెన" పథకాన్ని రూపకల్పన చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. అన్న అమృతహస్తం పథకం క్రింద ఎస్సీ కాలనీలో ఉండే దళితులకు భోజనంతో పాటు పల్లీలతో చేసే బెల్లం చెక్కీలు, ఓ పండు కూడా అదనంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం బడ్జెట్‌లో ఇంకా పేరు పెట్టని ఈ పథకం కోసం రూ.200 కోట్లను వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దళితవాడల్లో.. దళితులు ఎక్కువగా ఉండే కాలనీల్లో ఈ పథకాన్ని అమలుపరచాలని భావిస్తున్నట్లు సమాచారం.