కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.2074 కోట్ల నిధులు విడుదల చేసింది. కేంద్ర పన్నుల్లో 42 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది  ఎక్సైజ్ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ, సేవా పన్ను ఆదాయ పన్ను, కార్పోరేట్ పన్నల నుంచి మొత్తం రూ. 48 వేల 83 కోట్లు ఆదాయన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్జించింది. ఇందులోని ఏపీకి 4.3 శాతం వాటా ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2074 కోట్లు విడుదల చేసింది. కాగా ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏపీకి 12 వేల 481 కోట్లు అందాయి.