కాపులకు 5% రిజర్వేషన్ :ఏపీ క్యాబినెట్ నిర్ణయం
కాపులు 30 ఏళ్ల నుంచి చేస్తున్న పోరాటాలకు, ఉద్యమాలకు ఫలితం దక్కింది. కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
కాపులు 30 ఏళ్ల నుంచి చేస్తున్న పోరాటాలకు, ఉద్యమాలకు ఫలితం దక్కింది. కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మంజునాథ కమీషన్ సిపార్సు మేరకు సర్కార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
శనివారం కాపు రిజర్వేషన్లపై క్యాబినెట్ మరోసారి భేటీ అయ్యాక ఆమోద ముద్ర వేస్తారు. ఆ తరువాత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఫైలు పంపుతారు. కాపులకు 5% రిజర్వేషన్ ప్రకటించడంతో ఏపీలో రిజర్వేషన్లు 55 శాతానికి చేరాయి. కాపు రిజర్వేషన్లు బలిజ, తెలగ కులాలకూ వర్తిస్తాయి. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారంలో వస్తే..కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన సంగతి అందిరికీ విదితమే..!