Ap volunteers: సీన్ రివర్స్.. వైసీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదులు చేసిన వాలంటీర్లు.. ఎందుకో తెలుసా..?
Andhra pradesh: ఏపీ సచివాలయం, వాలంటీర్ ఉద్యోగులు వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
Ap volunteers hot comments on ysrcp: తమను వైసీపీ నేతలు బెదిరింపులకు గురిచేశారని ఏపీలో వాలంటీర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇటీవల ఏపీలో ఎన్నికల ముందు దాదాపుగా..1.08 లక్షల మంది వాలంటీర్, సచివాయం ఉద్యోగులు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా, వీరంతా స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గరకు వెళ్లి తమ గోడును చెప్పుకుంటున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక నేతలు, కార్పొరేటర్లు, చైర్మన్ లు, లోకల్ వైసీపీ నాయకులు బెదిరింపులకు గురిచేయడం వల్లనే తాము రాజీనామాలు చేశామని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ రాజీనామాలు చేయకపోతే.. తమ ప్రభుత్వం వచ్చాక తొలగిస్తామంటూ వైసీపీ నేతలు బెదిరింపులకు గురిచేశారంటూ ఏపీలో రాజీనామాలు చేసిన వివిధ జిల్లాలకు చెందిన వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..
ఇప్పుడు రాజీనామాలతో తమ కుటుంబాలు అన్ని రోడ్డున పడ్డాయని, తమకు న్యాయం చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి వాలంటీర్లు తమ బాధలను చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ మాజీ ఎమ్మెల్యేలపై దీనిపై మాట్లాడటానికి వెళ్లినప్పుడు తమపట్ల చాలా దురుసుగా ప్రవర్తించారని, ఇంట్లో ఉన్న లేనని చెప్పించారని, ఈ విషయంపై తమ వద్దకు వస్తే బాగుండదంటూ మరికొందరు నేతలు బెదిరింపులకు దిగారని కూడా వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో వాలంటీర్లు.. కాకినాడ ఎమ్మెల్యే కొండ బాబు దగ్గరకు వెళ్లి... కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే విధంగా.. పార్వతి పురం మన్యం జిల్లాలో రాజీనామా చేసిన వాలంటీర్లున తమను తిరిగి విధుల్లో తీసుకొవాలంటూ ఎంపీడీవోకు వినతి పత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. నెల్లూరుకు చెందిన రాజీనామా చేసిన వాలంటీర్లు.. స్థానిక వైసీపీ నేతలు, కార్పొరేటర్లు, తమపై ఒత్తిడి తీసుకొచ్చిన వారిపై పోలీసులు ఫిర్యాదులు చేశారు. సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదిలా ఉండగా.. ఏపీలో గతంలో అధికారంలో ఉన్న జగన్ సర్కారు.. ప్రజలకు పథకాలు చేరుకునే విధంగా వాలంటీర్, సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ దీని వల్లనే తాము ఓడిపోయామని ఎన్నికల తర్వాత వైసీపీ మాజీ మంత్రులు, నేతలు ఫైర్ అయ్యారు. వాలంటీర్ ల వల్ల.. స్థానిక నేతలకు, ప్రజలకు మధ్య గ్యాప్ ఏర్పడిందని వైఎస్సార్సీపీ నేతలు బహిరంగంగానే విమర్శించారు. ఈ క్రమంలో ఇటీవల ఏపీలో కొలువుదీరిన చంద్రబాబు సర్కారు.. వాలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter