Rains Alert: బంగాళాఖాతంలో ఆవర్తనం, ఏపీలో రానున్న మూడ్రోజులు వర్షాలు
Rains Alert: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్. ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనం కలగనుంది. రానున్న మూడ్రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Rains Alert: ఏపీ ప్రజలకు ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనం కలగనుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా వచ్చే మూడ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ సూచించింది. ఏయే జిల్లాల్లో వర్షాలు పడనున్నాయో తెలుసుకుందాం..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఏపీ తీరానికి ఆనుకుని ఉండటంతో పాటు మరో ఉపరితల ద్రోణి కూడా 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఫలితంగా ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు వచ్చే మూడ్రోజులు పడనున్నాయి. ఇవాళ అంటే ఆగస్టు 13వ తేదీన పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఇక రేపు అంటే ఆగస్టు 14వ తేదీన చిత్తూరు, తిరుపతి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.
ఇక ఆగస్టు 15వ తేదీన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, గుంటూరు, ఎన్టీఆర్, కోనసీమ, విజయనగరం, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. అదే విధంగా రాయలసీమలో కూడా ఆగస్టు 15వ తేదీన పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిన్న అంటే ఆగస్టు 12వ తేదీన కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. బాపట్లలో 13.3 మిల్లీమీటర్లు, కళింగపట్నంలో 7.8, కావలిలో 3, మచిలీపట్నంలో 4.1, నందిగామలో 2.2, నర్శాపూర్ లో 3.3, ఒంగోలులో 5.3, అమరావతిలో 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అదే సమయంలో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువే ఉన్నాయి. తిరుపతిలో గరిష్టంగా 35.7, అమరావతిలో 36.5, విశాఖలో 34.2 డిగ్రీల ఉష్షోగ్రత నమోదైంది. ఆగస్టు 15 తరువాత రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గనుందని అంచనా.
Also read: Independence Day 2023: జాతీయ జెండా పరిమాణం ఎంత ఉండాలి, జెండా వందనంలో ఫ్లాగ్ కోడ్ ఏం చెబుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook