AP Rain Alert: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. వచ్చే మూడు రోజుల్లో వర్షాలు..
AP Rain Alert: తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న ఏపీ వాసులకు కాస్త ఉపశమనం లభించనుంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Rain Alert for Andhra Pradesh: మరోసారి ఏపీకి రెయిన్ అలర్ట్. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
మరోపక్క ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు ఉదయం నుంచే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గురవారం అత్యధికంగా అనంతపురం జిల్లా శెట్టూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఆంధ్రప్రదేశ్ లో శుక్రవారం 60 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని ఏపీ విప్తతుల నిర్వహణ సంస్థ తెలిపింది.
14న తీరం దాటనున్న తుపాను
ఈ మోచా (మోఖా) తుపాను ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ఉండకపోవచ్చు. ఈ సైక్లోన్ ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ మధ్యలో కాక్స్ బజార్ ప్రాంతంలో మే 14న తీరం దాటనుంది. ప్రసుత్తం తుపాను కాక్స్‌బజార్ (బంగ్లాదేశ్)కు దక్షిణ నైరుతి దిశలో 1,190 కి.మీ. దూరంలో, పోర్టుబ్లెయిర్‌కు నైరుతి దిశలో 510 కి.మీ. దూరంలో, సీత్త్వే (మయన్మార్)కు దక్షిణ నైరుతి దిశలో 1,100 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవులతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ తుపాన్ తీరం దాటే సమయంలో 175 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: Chukkala Bhoomulu Rights: చుక్కల భూముల రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook