Cyclone Sitrang Update: ఏపీకి సిత్రాంగ్ తుఫాన్ ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బంగ్లాదేశ్ దగ్గర తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పోర్ట్ బ్లెయిర్‌కు వాయువ్యంగా 475 కి.మీ దూరంలోనూ, సాగర్ ద్వీపానికి దక్షిణ-ఆగ్నేయంగా 780 కి.మీ మరియు బారిసల్ (బంగ్లాదేశ్)కి దక్షిణంగా 880 కి.మీ. దూరంలోనూ ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది రాగల 12 గంటల్లో వాయువ్య దిశగా పయనించి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇది క్రమంగా బలపడి అక్టోబరు 24 ఉదయం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉంది. అనంతరం ఇది అక్టోబరు 25 తెల్లవారుజామున బంగ్లాదేశ్ కు చెందిన టింకోనా ద్వీపం మరియు శాండ్‌విప్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబరు 25 వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, ఒకవేళ వేటకు వెళ్లిన జాలర్లు వీలైనంత త్వరగా ఒడ్డుకు చేరుకోవాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పోలీసులు ప్రకటనల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.


సిత్రాంగ్  ప్రభావంతో (Cyclone Sitrang) దక్షిణ అస్సాం, తూర్పు మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపురలతో సహా పలు ఈశాన్య ప్రాంతాల్లో అక్టోబర్ 24, 25, 26 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ దృష్ట్యా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. 


తుఫాన్ ముప్పు తప్పిన ఏపీ ప్రభుత్వం అలర్ట్ గానే ఉంది. ఇప్పటికే తీరప్రాంత ప్రజలను, జాలర్లను సముద్రంలో వేటకు వెళ్లొద్దని చెప్పింది. అంతేకాకుండా సహాయం కోసం కంట్లోల్ రూమ్స్, హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. సైక్లోన్ ఎఫెక్ట్ తో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు అధికారులు. 


Also Read: Viral: యూపీలో దారుణం... ప్లేట్‌లెట్లకు బదులు ఫ్రూట్ జ్యూస్ ఎక్కించారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook