Ap Weather update: బంగాళాఖాతంలో అల్ప పీడనం.. ఏపీలో భారీ వర్షం..
Ap Weather update: దేశ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. వరుణుడి ప్రతాపానికి ఉత్తరాది రాష్ట్రాలు వణుకుతున్నాయి. అటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్ప పీడనంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Ap Weather update: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న రెండు రోజుల్లో అది మరింత బలపడనుంది. అది ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఒడిశా తీరం వైపు కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురయనున్నాయి. ప్రకాశం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, నంద్యాల, శ్రీకాకుళం,గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అదే విధంగా ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు కృష్ణా,తిరుపతి,విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయిని వాతావరణ కేంద్రం తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిసే అవకాశాలున్నాయి. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు సూచించింది.
కర్నూలు, అనంతపురం, విశాఖ, సత్యసాయి, కడప, అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. రహదారులపై వరద నీరు ఏరులై ప్రవహిస్తోంది. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరుతో పాటు మెట్ట మండలాలైన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుసింది. జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టెన్నపాలెం వద్ద జల్లేరు వాగు ప్రవహిస్తోంది. అదేవిధంగా జీలుగుమిల్లి మండలంలోని అశ్వరావుపేట వాగు పొంగటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించి పోయింది. బుట్టాయిగూడెం మండలం కాపవరం అటవీ ప్రాంతంలో కొలువుతీరిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వెళ్లే మార్గమధ్యంలో వాగులు పొంగుతున్న నేపథ్యంలో ఆలయ దర్శనాన్ని కమిటీ సభ్యులు నిలిపివేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల అధికారులతో పరిస్థితిని సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. అంతేకాదు పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ప్రాణ నష్టం లేదా పశు నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook