Ap Politics: పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా, వైఎస్ షర్మిలకు మార్గం సుగమం
Ap Politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
Ap Politics: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు షాక్ ఇచ్చారు. పీసీసీ అద్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. గిడుగు రుద్రరాజు రాజీనామాతో షర్మిలకు మార్గం సుగమమైందని తెలుస్తోంది.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజు కారణం మాత్రం వెల్లడించలేదు. పార్టీ షర్మిల రాకను స్వాగతించిన ఆయన..అవసరమైతే ఆమె కోసం పదవి వదులుకుంటానని చెప్పారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి చాలారోజులౌతున్నా ఇంకా ఆమెకు బాధ్యతలు అప్పగించే విషయంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఊగిసలాడుతోంది. ఇప్పుడు ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు మార్గం సుగమమైందని తెలుస్తోంది. గిడుగు రుద్రరాజు అందుకే, ఆమె కోసమే పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
Also sir: Ayodhya Rammandir Issue: అయోధ్య రామమందిరం చుట్టూ వివాదం, వ్యతిరేకిస్తున్న శంకరాచార్యులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook