APJAC Strike: ఉద్యోగ సంఘాలతో ఇవాళ ప్రభుత్వం చర్చలు, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
APJAC Strike: ఏపీ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య ఇవాళ చర్చలు జరగనున్నాయి. సమస్యల పరిష్కారం కోసం గత కొద్దికాలంగా ఆందోళన చేపట్టిన ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
APJAC Strike: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెపై ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ప్రభుత్వంతో ఇవాళ జరిగే చర్చలపై ఉద్యమం ఆధారపడి ఉంటుంది. సమస్యల పరిష్కారానికి 10 రోజుల డెడ్‌లైన్ విధించడంతో..ఇవాళ ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించడం కీలక పరిణామంగా మారింది.
మరి కాస్సేపట్లో ఏపీ జేఏసీ అమరావతి నేతలతో ఏపీ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చర్చలు జరపనున్నారు. సమస్యల పరిష్కారం కోసం గత కొద్దికాలంగా ఆందోళన బాటలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్ విధించారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఉద్యోగ సంఘాలు భావించిన తరుణంలో ప్రభుత్వం నుంచి చర్చలకు ఆహ్వానం వచ్చింది. ఏపీజేఏసీ అమరావతి ఉద్యమానికి ఏఐటీయూసీ, సీఐటీయూసీ కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. డిమాండ్ల పరిష్కారం నిమిత్తం దశలవారీగా సమ్మె కొనసాగిస్తున్న ఉద్యోగ సంఘాలు ఇవాళ చర్చలకు వెళ్లటం ఇది మూడవసారి. ఇవాళ జరిగే చర్చలు కీలకం కానున్నాయి.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి 54 పేజీల మెమోరాండం సమర్పించిన ఏపీజేఏసీ ఉద్యమం ఇప్పుడు మూడవ దశలో ఉంది. జూన్న 8వ తేదీన గుంటూరులో ప్రాంతీయ సదస్సు ఏర్పాటు కానుంది. తమ ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం ఇప్పటి వరకూ కొన్ని జీవోలు విడుదల చేసిందని ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంకా కొన్ని డిమాండ్లు పరిష్కారం కాలేదని వాటికోసం ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. ఇవాళ జరిగే చర్చల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్లలో ప్రధానమైనవాటిపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
ఇవాళ ఉదయం 11.30 గంటలకు ఏపీ ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం కానున్నారు. ఉద్యమాన్ని చులకనగా చూస్తే తమ చేతుల్లో ఉండదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఏపీ జేఏసీ నేతలు.
Also read: Avinash Reddy Bail: అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరుకు కారణాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook