ఆంధ్రప్రదేశ్‌లో  ఇంటర్మీడియట్ కాలేజీలలో 2020-21 విద్యా సంత్సరానికిగానూ ప్రవేశాలకు తొలిసారిగా ఆన్‌లైన్ విధానం (AP Inter Online Admission 2020-21) వినియోగిస్తున్నారు. ఇంటర్ ప్రవేశాలను బోర్డు ప్రారంభించింది. ఇందులో భాగంగా  అక్టోబర్ 21 నుంచి ఏపీలో రెండేళ్ల ఇంటర్, ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు (AP Inter Online Admissions 2020-21) రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ ఏర్పాట్లు చేసింది. కోవిడ్19 (COVID-19) పరిస్థితుల నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాల ప్రక్రియ చేపట్టినట్లు ఏపీ ఇంటర్ బోర్డు సెక్రటరీ వి. రామకృష్ణ మంగళవారం విజయవాడలో తెలిపారు.



నేటి నుంచే ఏపీ ఇంటర్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. అధికారిక వెబ్‌సైట్‌ https://bie.ap.gov.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈనెల 29న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.  కాగా, ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 200 ఫీజు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 100 దరఖాస్తు ఫీజు చెల్లించాలన్నారు. విద్యార్థులు తమ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి 18002749868 టోల్ ఫ్రీ నంబర్ కాల్‌ చేయొచ్చని రామకృష్ణ పేర్కొన్నారు. 


ఏపీ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు క్లిక్ చేయండి


ఏపీ ఇంటర్ అడ్మిషన్ల నోటిఫికేషన్  


 


గతంలో మాదిరిగా కాకుండా ఒక్కో సెక్షన్‌లో కేవలం విద్యార్థుల సంఖ్యను 40 ఉండేలా చూస్తున్నారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో సీట్ల భర్తీలో భాగంగా ఆర్ట్స్ గ్రూపుతో కలిపి గరిష్టంగా 9 సెక్షన్లకు మాత్రమే ఏపీ ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరూ పదో తరగతి విద్యార్థులను పాస్ చేసిన కారణంగా వారంతా ఇంటర్‌లో చేరే అవకాశం ఉందని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe