ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు (APPSC Group 1 Mains Hall Ticket 2020)ను విడుదల చేసింది. ఏపీ గ్రూప్-1 అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ (AP Group 1 Mains Hall Tickets 2020 Download)ను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏపీలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి 


 


ఏపీలోని మొత్తం 169 గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయడానికి 2019 మే 26న స్క్రీనింగ్ టెస్టును ఏపీపీఎస్సీ నిర్వహించడం తెలిసిందే. 1,14,473 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కు 59,697 మంది, పేపర్-2 పరీక్షకు 59,200 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు మొత్తం 8,351 మంది అర్హత సాధించారు. ఏపీ గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో ఎంపిక చేశారు. తాజాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్స్ విడుదల చేసింది.


APPSC Group 1 Mains Hall Ticket 2020 Download Here 



ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలు.. (APPSC Group 1 Mains Exam Date 2020)


  • తెలుగు పేపర్ (అర్హత పరీక్ష): 02.11.2020


  • ఇంగ్లీష్ పేపర్ (అర్హత పరీక్ష): 03.11.2020


  • ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పేపర్-1: 05.11.2020


  • ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పేపర్-2: 07.11.2020


  • ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పేపర్-3: 09.11.2020


  • ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పేపర్-4: 11.11.2020


  • ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పేపర్-5: 13.11.2020


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe