విజయవాడలో ఏపీపీఎస్సీ ఆఫీసు ప్రారంభం
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కు సంబంధించిన కొత్త కార్యాలయాన్ని చైర్మన్ పిన్నమనేని ఉదయ భాస్కర్ గురువారం ప్రారంభించారు.
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కు సంబంధించిన కొత్త కార్యాలయాన్ని చైర్మన్ పిన్నమనేని ఉదయ భాస్కర్ గురువారం ప్రారంభించారు. బందరు రోడ్డులోని ఆర్ & బీ భవనం రెండో అంతస్తును ఏపీ సర్కారు కార్యాలయ నిర్మాణానికి కేటాయించింది. 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కొత్త ఆఫీసును నిర్మించారు.
డీఎస్సీ లాంటి పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో జనవరి 2018 నుంచి విజయవాడ నుంచే పూర్తి స్థాయి కార్యాకలాపాలు జరుగుతాయని ఉదరు భాస్కర్ తెలిపారు. డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని కార్యాలయాన్ని ఖాళీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. గ్రూప్ 2 పత్రాల తనిఖీ జనవరి రెండో వారంలో విజయవాడలోనే కొత్త కార్యాలయంలోనే జరుగుతుందని ఆయన తెలిపారు. కొత్త ఏడాదిలో పోస్టుల భర్తీకి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. డీఎస్సీని ఇకపై ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహిస్తామని వెల్లడించారు.