విజయవాడ: మే 5వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు ప్రకటించారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయబాస్కర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలోని 13 జిల్లాల నుంచి మొత్తం 2,95,036 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని, మే 5న రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 727 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుందని తెలిపారు. నిర్ణీత సమయానికన్నా ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని చెప్పిన చైర్మన్ ఉదయభాస్కర్.. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వచ్చేటప్పుడు ప్రభుత్వం జారీచేసిన ఎదైనా ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంటతీసుకురావాలని స్పష్టంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

APPSC Group 2 Hall ticket download direct link


పరీక్షలో అభ్యర్థులు ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్టు తమ దృష్టికి వస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయబాస్కర్ అభ్యర్థులను హెచ్చరించారు. బ్లూ లేదా నలుపు పెన్నులతో మాత్రమే పరీక్ష రాయాలని అభ్యర్థులకు సూచించారు.