వాట్సాప్‌లో ముఖ్యమంత్రిపై అధికారి కామెంట్స్.. సస్పెండ్
ఏపి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నేరం కింద రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.వి.విద్యాసాగర్ సస్పెండ్ చేస్తూ ఏపి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి, సిఐడి చీఫ్ పి.వి. సునీల్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
అమరావతి : ఏపి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నేరం కింద రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.వి.విద్యాసాగర్ సస్పెండ్ చేస్తూ ఏపి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి, సిఐడి చీఫ్ పి.వి. సునీల్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారనే ఆరోపణలు రుజువైన నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేసినట్టు సునీల్‌కుమార్ స్పష్టంచేశారు. దుష్ప్రవర్తన, క్రమశిక్షణ, సెక్షన్ 25ను ఉల్లంఘించి రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సునీల్ కుమార్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.
Also read : రేపటికల్లా నగదు మీ ఖాతాల్లో పడుతుంది
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యాసాగర్ తన మొబైల్ వాట్సాప్ గ్రూపుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు విషయాలను పోస్ట్ చేశారని.. అందులో సీఎంపై అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయమై శాఖాపరమైన విచారణ జరపగా.. ఆధారాలతో సహా ఆయనపై ఉన్న ఆరోపణలన్నీ వాస్తవమేనని నిర్ధారణ చేసుకున్న తర్వాతే క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని సునీల్ కుమార్ తెలిపారు.
ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తోన్న ఉద్యోగులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయని.. ఆ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఏపీ ప్రభుత్వ ప్రవర్తన నియమావళి ప్రకారం క్రమశిక్షణా చర్యలను తీసుకోక తప్పదని ఆయన పరోక్షంగా ప్రభుత్వ ఉద్యోగులను హెచ్చరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..