గుంటూరు: మంగళరిగిలో సోమవారం సాయంత్రం దారుణ ఘటన చోటు చేసుకుంది. మంగళగిరి టౌన్ షిప్ లోని హుడా ప్లాట్ వద్ద గుర్తుతెలియని దుండగులు ప్రేమజంటపై దాడి చేశారు. ఈ దాడిలో అక్కడికక్కడే యువతి మృతి  చెందగా.. యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..గాయపడ్డ యువకుడికి స్థానిక ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించగా.. యువతికి పోర్టుమార్టు కోసం తరలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసుల కథనం ప్రకారం జ్యోతి,  శ్రీనివాసరావు తాడేపల్లిగూడెం మహానాడుకు చెందిన వారు. యువతి జ్యోతి ఇటీవలె గుంటూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంఫార్మసీ పూర్తి చేసింది. సర్టిఫికెట్లు తీసుకోవడానికి సోమవారం కాలేజీకి వెళ్లింది. తోడుగా ప్రియుడు శ్రీనివాసరావు  కూడా వెళ్లాడు. ఇద్దరు కలిసి బైక్ పైన మంగళగిరి టౌన్ షిప్ కు వెళ్లారు. అనంతరం హుడా అపార్ట్ మెంట్స్ వద్ద ఏకాంత ప్రదేశంలో నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఇదే సందర్భంలో గుర్తుతెలియని దుండగలు అకస్మాత్తుగా వారిపై దాడికి పాల్పడ్డారు.


యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారని.. ప్రతిఘటించడంతో బీర్ బాటిట్లతో దాడికి తెగబడ్డారని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. అయితే ఘటనపై పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రణాళిక బద్ధంగా దాడి చేశారా?..ఎవరూ లేరని గమనించి దాడి చేశారా ? ఇంతకీ ఆ నలుగురు ఎవరూ అనే కోణంగో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం చేసేందుకు ఇలా బరితెగించారా?..దాడి వెనుక మరే ఇతర కారణం ఉందా ? అనే కోణం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి సెల్ ఫోన్ సీజ్ చేసుకున్న పోలీసులు.. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఘటనా జరిగిన ప్రదేశంలోని సిసి ఫూటేజీల ఆధారంగా కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు.