ఏపీకి ఆటోమొబైల్ పరిశ్రమ; కియా మోటార్స్ తో ఏపీ సర్కార్ ఒప్పందం
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా అమరావతిలోని సచివాలయం వద్ద ఈ రోజు కంపెనీ ప్రతినిధుల సమక్షంలో కియా ఎలక్ట్రిక్ కార్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కారును నడిపిన చంద్రబాబు..కియా కారు చాలా సౌకర్యవంతంగా ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కియా మోటార్స్ రాకతో అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోతాయని వెల్లడించారు. అనంతపురం ప్లాంటులో తొలి కారు వచ్చే ఏడాది జనవరిలో బయటకు వస్తుందన్నారు . కియా కంపెనీ ఇక్కడ తయారుచేసే కార్లలో 90 శాతం దేశీయంగా అమ్ముతారనీ, మిగిలిన 10 శాతం కార్లను విదేశాలకు ఎగుమతి చేస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విద్యుత్ చవకగా మారేందుకు సౌర విద్యుత్ ఒక్కో యూనిట్ రూ.1.50కే లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. పర్యావరణహితమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామన్నారు.
కియా మోటర్ ప్రతినిధి మాట్లాడతూ కియా కార్లకు ప్రత్యేక ఉందన్నారు. విద్యత్ తో నడిచే కారుకు ఓసారి చార్జింగ్ పెడితే 455 కిలోమీటర్లు దూసుకెళ్లవచ్చుని పేర్కొన్నారు. దీన్ని జనవరిలో మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు