Anandayya corona medicine: ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందు మరోసారి తెరపైకి వచ్చింది. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron)కు ఆనందయ్య మందు (Anandayya corona medicine) పంపిణీ చేస్తున్నారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయుష్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా ఒమిక్రాన్ మందు అంటూ పంపిణీ చేయడం సరికాదని ఆయుష్ శాఖ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఆనందయ్యకు నోటీసులు (AYUSH department notices to Anandayya) జారీ చేసింది. మందు పంపిణీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆనందయ్య జవాబు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయుష్ శాఖ పేర్కొంది. అవసరమైతే ఒమిక్రాన్ మందులో వాడే పదార్థాలను పరిశీలిస్తామని పేర్కొంది. కాగా ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందుకు ఎలాంటి అనుమతి లేదని ఆయుష్ శాఖ (AYUSH department) మరోసారి స్పష్టం చేసింది. 48 గంటల్లో ఒమిక్రాన్‌ను తగ్గిస్తానంటూ ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నారని.. ఇది కరెక్ట్ కాదని ఆయుష్ శాఖ వివరించింది. ఆనందయ్య వద్ద శాస్త్రీయ ఆధారాలు ఉంటే ఇవ్వాలని..  ఇమ్యూనిటీ కోసం ఆయుష్‌ శాఖలో ఔషధాలున్నాయని ఆయుష్‌ శాఖ కమిషనర్‌ రాములు పేర్కొన్నారు.


Also Read: MLA Payyavula Keshav: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు కరోనా పాజిటివ్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook