Badvel bypoll updates: బద్వేలు ఉప ఎన్నికకు 15 మంది పోటీ
Badvel bypoll latest updates: బద్వెలు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న వారిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ (Dasari Sudha), బీజేపీ అభ్యర్థి సురేశ్, కాంగ్రెస్ అభ్యర్థి పీఎం కమలమ్మ ప్రధాన అభ్యర్థులుగా నిలిచారు.
Badvel bypoll latest updates: కడప: బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు అంతిమంగా 15 మంది బరిలో నిలిచారు. మొత్తం 27 మంది అభ్యర్థులు బద్వెలు ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేయగా.. వారిలో 9 మంది నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. మిగతా 18 మంది అభ్యర్థులలో మరో ముగ్గురు అభ్యర్థులు బుధవారం తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో అంతిమంగా 15 మంది ఫైనల్ అయ్యారు.
బద్వెలు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న వారిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ (Dasari Sudha), బీజేపీ అభ్యర్థి సురేశ్, కాంగ్రెస్ అభ్యర్థి పీఎం కమలమ్మ ప్రధాన అభ్యర్థులుగా నిలిచారు.
Also read : Badvel Bypoll: బద్వేలు బరిలో 35 నామినేషన్లు, వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
ఇదిలావుంటే, మరోవైపు తెలంగాణలోని హుజూరాబాద్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav), బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eetala Rajender), కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట నరసింగ రావు బరిలో (Balmoori Venkata Narsinga Rao) ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. ఈ రెండు ఉప ఎన్నికల స్థానాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది.
Also read : Huzurabad bypolls candidates: హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో 30 మంది పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook