అనంతపురం: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మీడియా ప్రతినిధిపై హిందూపురం టీడీపీ అభ్యర్థి, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కాస్త దురుసుగా ప్రవర్తించారు. దీంతో బాలయ్య  తిట్టారని..కొట్టారని కామెంట్ చేస్తూ ఆయన దీనికి సంబంధించిన వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.  తాజా ఘటనతో బాలయ్యపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల వేళ లో విమర్శలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై  బాలయ్య వివరణ ఇచ్చారు.  అల్లరి మూకలని అనుకుని వారిని వారించానన్నారు. అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసింది . అంతే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదు.  ఈ విషయం లో మీడియా మిత్రులకి బాధ కలిగించి ఉంటే క్షమించాలని కోరారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో  ఓ పోస్ట్ పెట్టారు.