Balakrishna - Hindupur:తెలుగు దేశం పార్టీ స్థాపన నుంచి ఒకప్పటి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపూర్‌ అసెంబ్లీ నియోజవకర్గం కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఇక్కడ నుంచి తెలుగు దేశం వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్‌తో పాటు హరికృష్ణ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అటు నందమూరి బాలకృష్ణ కూడా తండ్రి, అన్నయ్య బాటలో ఇదే నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టారు. తొలిసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన బాలకృష్ణ.. రెండోసారి విపక్ష పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన పార్టీకి కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా బరిలో దిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నందమూరి బాలకృష్ణకు పోటీగా కాకినాడ శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణనంద స్వామి బరిలో దిగుతున్నారు. ఈయన బీజేపీతో టీడీపీ, జనసేన కలవక ముందు నుంచే హిందూపురం లోక్ సభ నియోజకవర్గంలో తన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేకాదు నియోజకవర్గంలో హిందూ, ముస్లిమ్ తేడా లేకుండా అక్కడ ప్రజల కోసం ఉద్యోగ మేళాలు నిర్వహించారు. అంతేకాదు ఈ లోక్‌సభ సీటు విషయమై బీజేపీ పెద్దలు ఆయనకు హామి ఇవ్వడంతో ఆయన కూడా అక్కడ కొద్ది రోజుల ముందు నుంచే తన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. హిందూపూర్‌ను తన కార్యక్షేత్రంగా ఎంచుకోవడానికి గల కారణాలను వెల్లడించారు. దేశంలో హిందూపేరుతో ఉన్న ఏకైక నియోజకవర్గం ఇదే కాబట్టి.. ఇక్కడ నుంచే తన కార్యాచరణ ప్రారంభించారు స్వామిజీ.


అయితే పొత్తులో భాగంగా ఈ లోక్ సభ సీటు తనకు దక్కకుండా హిందూపూర్ టీడీపీ అభ్యర్ధి  బాలయ్య.. చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి ఆ సీటు తనకు దక్కుండా చేసారని స్వామిజీ పలు యూట్యూబ్‌ ఛానెల్స్‌కు ఇచ్చి ఇంటర్వ్యూల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు. తాను పోటీ చేస్తే మైనారిటీ ఓట్లు తనకు పడవనే కారణంతో బాలయ్య.. చంద్రబాబు ఒత్తిడి తెచ్చి ఈ సీటు తనకు దక్కకుండా చేసారని చెబుతున్నారు స్వామిజీ.


అయితే ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాట కారణంగా ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా స్వతంత్ర్యగా అభ్యర్ధిగా హిందూపూర్ నుంచి పోటీ చేస్తున్నట్టు స్వామి పరిపూర్ణానంద సరస్వతి తెలిపారు. ఇక ఈ ఎన్నికల్లో స్వామిజీకి ఎన్నికల సంఘం అగ్గిపెట్ట గుర్తు  కేటాయించింది. ఏది ఏమైనా అగ్గిపెట్ట గుర్తుతో కూటమిలో అగ్గిరాజేసారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా నామినేషన్స్ ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. దీంతో హిందూపూర్‌లో ఇండిపెండెంట్ అభ్యర్దిగా శ్రీపరిపూర్ణానంద సరస్వతి ఎన్నికల బరిలో టీడీప అభ్యర్ది బాలయ్యకు గట్టి పోటీ ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది.


మరోవైపు తనను స్థానికేతురుడిగా ప్రచారం చేస్తారన్న వారిపై మండిపడ్డారు. బాలయ్య.. హిందూపూర్‌లో స్థానికుడా.. ఆయన ఎక్కడ జన్మించారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మంగళగిరి నుంచి పోటీ చేస్తోన్న నారా లోకేష్.. అలాగే కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్లందరు ఆయా స్థానాల్లో స్థానికేతురులు కాదా అని స్వామిజీ ప్రశ్నిస్తున్నారు.


త్యాగాలు చేయాలని చంద్రబాబు నాయుడు చెబుతున్నారని.. తమ లాంటి స్వామిజీలే త్యాగాలు చేయాలా.. ? చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు త్యాగాలు చేయకూడదా అని ఆసక్తికర ప్రశ్నలు వేస్తున్నారు. అంతేకాదు బాబు ఫ్యామిలీ నుంచి చంద్రబాబుతో పాటు ఆయన వియ్యంకుడు బాలకృష్ణ, మరోవైపు ఆయన కుమారుడు బాలయ్య అల్లుడు లోకేష్.. బాలయ్య మరో అల్లుడు శ్రీ భరత్ వంటి వారు ఎన్నికల బరిలో ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు స్వామిజీ.మరోవైపు ఏపీలో బీజేపీలో టికెట్ అందుకున్న వారిలో ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారనే విషయాన్ని ప్రస్తావించారు. అటు జనసేనలో కూడా చాలా టికెట్స్ తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లకే ఇచ్చారనే విషయాన్ని ప్రస్తావించారు.


హిందూపూర్‌ నియోజకవర్గంలో బలాబలలా విషయానికొస్తే.. బాలయ్యకు హీరోగానే కాకుండా.. తెలుగు దేశానికి సాంప్రదాయంగా వస్తోన్న ఓటర్లు ఆయనకు అండగా ఉన్నారు. మరోవైపు స్వామిజీకి అనుకూలంగా హిందూ సంఘాలు రంగంలోకి దిగాయి. పైగా స్వామిజీపై అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయమే నెలకొని ఉంది. పైగా స్వామిజీ కూడా టీడీపీ అభ్యర్ధి బాలకృష్ణ గెలిస్తే.. ఏదైనా పనికోసం హైదరాబాద్ వెళ్లాలి. వైసీపీ అభ్యర్ది గెలిస్తే బెంగళూరులో  ఉంటారు. ఎవరు గెలిచిన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరనే స్వామిజీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అదే తనకు ఓటు వేస్తే ఇక్కడే ప్రజలే మధ్య ఉంటానంటున్నారు. అంతేకాదు కేంద్రంలో ఏదైనా పనుల కోసం డైరెక్ట్‌గా నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి నేతలను నేరుగా కలుసుకునే అవకాశం తనకు ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక స్వామిజీ పోటీలో గెలవకపోయినా.. బాలయ్య విజయావకాశాలను దెబ్బ తీసే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ గండం నుంచి బాలయ్య బయటపడతాడా ? లేదా అనేది చూడాలి.


Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook