Bandla Ganesh on Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. వరుస ట్వీట్లతో తన ఆక్రోశాన్ని వెల్లగక్కారు. టీడీపీ కమ్మ కుల పార్టీ అని... టీడీపీ హయాంలో ఆ సామాజికవర్గానికి చెందినవారికే ఉద్యోగాలు ఇచ్చారని విజయసాయి చేసిన వ్యాఖ్యలు బండ్ల గణేష్‌కు ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఘాటైన వ్యాఖ్యలతో ట్విట్టర్ వేదికగా విజయసాయికి బండ్ల గణేశ్ కౌంటర్ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కులాల పేరుతో చిచ్చు పెడితే నీ చరిత్రను నువ్వే చింపి చిచ్చు పెట్టుకున్న పిచ్చి పిచ్చుక అవుతావు అంటూ విజయసాయి రెడ్డిపై బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. 'నీకు నచ్చకపోతే వ్యక్తి పేరు పెట్టి తిట్టు.. అంతేకానీ కులాన్ని కాదు... నిన్ను జైలుకు పంపించింది కమ్మ  వారు కాదు... త్వరలోనే నువ్వు జగన్‌కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి... ఈ ట్వీట్ తర్వాత నన్నెంత ఇబ్బంది పెడతావో తెలుసు. అన్నింటికీ సిద్ధపడే చేస్తున్నా.' అని బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


తనకు వైఎస్సార్ అన్నా, జగన్ అన్నా గౌరవమని... నువ్వే రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రానివి అని విజయసాయి రెడ్డిని విమర్శించారు. తమ కులాన్ని ఎందుకని అన్ని విషయాల్లోకి లాగుతున్నావని ప్రశ్నించారు. కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలని... అన్ని కులాల్లోనూ మంచివాళ్లు, చెడ్డవాళ్లు ఉన్నారని అన్నారు. 'అయ్యా ఆంధ్రకి పట్టిన అష్ట దరిద్రమా, నీ పిచ్చకి నీ కుల పిచ్చకి, నీ డబ్బు పిచ్చకి, కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది.' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


చంద్రబాబును, టీడీపీని అడ్డుపెట్టుకుని కమ్మవారిని తిట్టొద్దని... ప్రతీ కమ్మ వారు తెలుగుదేశం పార్టీ కాదని బండ్ల గణేష్ పేర్కొన్నారు. తాను కమ్మవాడినే అని... అయితే టీడీపీ కాదని తెలిపారు. కమ్మవారిని తిట్టడాన్ని తట్టుకోలేకపోతున్నానని... నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసునని... ఎంపీ, అధికార పార్టీ నేత అనే కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నావని మండిపడ్డారు. బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తారా లేదా చూడాలి. 







Also Read: Mysterious Liver Illness: ప్రపంచాన్ని భయపెడుతున్న మరో అంతుచిక్కని వ్యాధి.. అమెరికా, యూకెల్లో బయటపడిన కేసులు...


Also Read: Suicide in Metro Station: ఢిల్లీ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన ఆ యువతి మృతి...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook