Bettings on YS Avinash Reddy Arrest: అవినాష్ రెడ్డి అరెస్ట్పై భారీ మొత్తంలో బెట్టింగ్స్
Bettings on YS Avinash Reddy Arrest: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచడంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్పై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు అవినాష్ రెడ్డి అరెస్టుపై జోరుగా బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డికి నోటీసులు జారీచేసిన సీబీఐ.. ఆయన్ను ప్రశ్నించి వదిలేసింది.
Bettings on YS Avinash Reddy Arrest: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచడంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్పై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు అవినాష్ రెడ్డి అరెస్టుపై జోరుగా బెట్టింగులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డికి నోటీసులు జారీచేసిన సీబీఐ.. ఆయన్ను ప్రశ్నించి వదిలేసింది. మరోవైపు ఇదే కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. దీంతో కాస్త వెనుకో, ముందో అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా జరుగుతుందనే వార్తల నేపథ్యంలో కడపలో పందెంరాయుళ్లు తమ లోక్ సభ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అంశంపై బెట్టింగులు కాస్తున్నారు.
బెట్టింగ్స్ ఏంటంటే..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని కొందరు బెట్టింగ్ కాస్తే... అరెస్ట్ చేయరంటూ ఇంకొందరు పందాలు కాస్తున్నారు. అరెస్ట్ అవుతారని బెట్టింగ్ కాసే వాళ్లలో కొంతమంది ఫలానా తేదీలోగానే అరెస్టులు ఉండే అవకాశం ఉందని కూడా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, అవినాష్ రెడ్డి నివాసం ఉంటున్న పులివెందులలో కూడా జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ బెట్టింగుల్లో వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు సొమ్ము చేతులు మారుతున్నట్టు సమాచారం అందుతోంది. వైఎస్ అవినాష్ రెడ్డి మద్దతుదారులు అరెస్ట్ ఉండదని బెట్టింగ్ కాస్తే.. ఆయన వ్యతిరేక వర్గీయులు అరెస్ట్ ఉంటుందంటూ బెట్టింగ్ కాస్తున్నట్టు పబ్లిక్ టాక్ వినిపిస్తోంది.
వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ వార్తల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకవేళ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ జరిగితే, వైఎస్ కుటుంబానికి అధిక ప్రాబల్యం ఉన్న రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనూ నిరసనలు చెలరేగే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ భారీ స్థాయిలో నిరసనలు చేపట్టేలా వైసీపీ శ్రేణులు ప్లాన్ చేసినట్లు సమాచారం.
వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు సైతం పార్టీ కార్యకర్తలు కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగి టీడీపీ, సీబీఐకి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో విధ్వంసం, హింసకు తావులేకుండా ఎక్కడికక్కడ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం ఉంటున్న పులివెందులతో పాటు రాయలసీమలోని ఇంకొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అదనపు బలగాలు మోహరించినట్లు సమాచారం అందుతోంది.