Priyanka jain: శ్రీ వారికి పరమ భక్తులం.. ప్రాంక్ వివాదంపై మరో వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక జైన్, శివ.. ఏమన్నారంటే..?
Priyanka Jain apologizes video: బిగ్ బాస్ ఫెమ్ ప్రియాంక జైన్.. తిరుమలలో ఇటీవల చేసిన ప్రాంక్ వీడియో పెనువివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ సైతం సీరియస్ గా స్పందించింది. దీంతో తాజాగా, ప్రియాంకజైన్ మరొ వీడియోను రిలీజ్ చేసినట్లు తెలుస్తొంది.
Priyanka Jain apologizes on prank controversy: తిరుమలలో ఇటీవల కొందరు శ్రీవారి ఆలయ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. పవిత్ర మైన శ్రీవారి మాడ వీధుల్లో ప్రాంక్ లు వీడియోలు తీస్తు హల్ చల్ చేస్తున్నారు. అంతే కాకుండా.. భక్తుల మనో భావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ ఘటన కూడా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ సీరియస్ అయ్యింది.
వీరి వ్యవహారంపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే.. మరల బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంకజైన్, శివకుమార్ లు ఇటీవల తిరుమల నడక మార్గంలో.. ఏడో మైలురాయి వద్ద పులి అంటూ ప్రాంక్ వీడియోలు తీశారు. ఇది కాస్త వైరల్ గా మారింది. దీనిపై టీటీడీ సైతం సీరియస్ అయ్యింది. శ్రీవారి భక్తులు సైతం.. దీన్ని ఖండించారు. పవిత్రమైన ప్రదేశాలకు వచ్చి..ఇలాంటి పనులు చేయడమేంటని కూడా ఫైర్ అయ్యినట్లు తెలుస్తొంది.
ఈ నేపథ్యంలో తాజాగా.. ప్రియాంకజైన్, శివ దీనిపై మరో వీడియోను రిలీజ్ చేశారు. తాము శ్రీవారికి పరమ భక్తులమంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఎవరి మనోభావాల్ని దెబ్బతీయాలని గానీ, ఇతర ఏవిధమైన ఆలోచనలు లేవని క్లారిటీ ఇచ్చారు. అనుకొకుండా జరిగిన సంఘటన అని కూడా వీరిద్దరు చెప్పుకొచ్చారు. జరిగిన ఘటన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నామని, చేతులు జోడించి.. టీటీడీకి, శ్రీవారి భక్తులకు, హిందు సంఘాలకు సారీ చెప్తున్నామని.. ఇలాంటి తప్పిదాలు మరెప్పుడు కూడా.. జరక్కుండా చూస్తామని కూడా ప్రియాంక జైన్, శివలు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. ప్రియాంక జైన్ బుల్లితెర ఆర్టీస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించిందని చెప్పుకొవచ్చు. మౌనరాగం, జానకీ కలగనలేదు అనే సీరియల్స్ లో నటించింది. తిరుమల మెట్ల మార్గంలో వీరిద్దరు చేసిన ప్రాంక్ వీడియో వల్ల.. వీరిపై టీటీడీ, భక్తులు సీరియస్ గా స్పందిచడంలో దెబ్బకు దిగోచ్చి సారీ చెప్పినట్లు తెలుస్తొంది.