ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకు షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ఆ పార్టీ కీలకనేత యనమల కుటుంబంలో అసమ్మతి రాజుకుంది. యనమల వర్సెస్ కృష్ణుడి మధ్య వ్యవహారం చెడుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో ఇటీవల రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార పార్టీలో నెల్లూరు రాజకీయాల కలకలం కల్గిస్తున్నాయి. ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిల అసమ్మతి అధికార పార్టీని పూర్తిగా ఇరకాటంలో పడేసింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారమైతే ఇంకా చల్లారనే లేదు. నెల్లూరు రాజకీయాలు అధికార వైసీపీని సమస్యల్లోకి నెడితే..తుని రాజకీయాలు మాత్రం టీడీపీని ఇరుకునపడేస్తున్నాయి. ఆ పార్టీలో అసమ్మతి ఏకంగా ఆ పార్టీ సీనియర్ నేత కుటుంబంలోంచే ఉండటం గమనార్హం. తునిలో యనమలకు అతని సోదరునికి మధ్య దూరం పెరుగుతోంది. 


తుని నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచిన యనమల రామకృష్ణుడు ఆ నియోజకవర్గంలో పట్టు కోల్పోయారు. గత రెండు ఎన్నికల్లో అతని సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేసి మంత్రి దాడిశెట్టి రాజా చేతిలో పరాజయం పొందారు. ఈ నేపధ్యంలో తుని నియోజకవర్గ ఇంఛార్జ్‌గా యనమల రామకృష్ణుడు తన కుమార్తె దివ్వను నియమించారు. పార్టీ అధిష్టానం ఈ నియామకాన్ని ఖరారు చేసిది. ఇదే ఇప్పుడు ఆ కుటుంబంలో అసమ్మతికి కారణమైంది. తనను దూరం పెట్టడంపై కృష్ణుడు అతని అనుచరవర్గం పూర్తి అసంతృప్తితో ఉంది. అన్న కుమార్తెకు మద్దతివ్వనని బాహాటంగా విమర్శించకపోయినా..లోలోపల మాత్రం ఆగ్రహంగా ఉన్నారు. చివరిగా చంద్రబాబుని కలిసి ఈ విషయాన్ని తేల్చుకుంటానని యనమల కృష్ణుుడు బహిరంగంగా వెల్లడించారు. పార్టీ తీసుకున్న నిర్ణయం తనకు మనస్థాపం కల్గించిందన్నారు. 


వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారా


ఇదే అదనుగా తుని రాజకీయాలపై కొన్ని వార్తలు రాజ్యమేలుతున్నాయి. టీడీపీ తనను దూరం పెట్టడం, నియోజకవర్గ ఇంఛార్జ్‌గా సొంత అన్నయ్య..తన కుమార్తెను నియమించుకోవడంతో కృష్ణుడు త్వరలో వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అటు వైసీపీ కూడా ఎమ్మెల్సీ పదవి లేదా టీటీడీ బోర్డులో పదవి ఇచ్చేందుకు ఆఫర్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో తుని వైసీపీ నియోజకవర్గ స్థాయి వాట్సప్ గ్రూపుల్లో ఇటీవల కృష్ణుడిపై ట్రోలింగ్ చేయవద్దనే సూచనలు రావడం పుకార్లకు బలం చేకూరుతోంది. అంటే వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టు సమాచారం. 


Also read: Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇవాళే ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook