WhatsApp: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వాట్సప్‌తో చిటికెలో ప్రభుత్వ సేవలు
Andhra Pradesh Civic Services Available With WhatsApp: ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాట్సప్ ద్వారా చిటికెలో సర్టిఫికట్లు, బిల్లులు, ఇతర ప్రభుత్వ సేవలు పొందవచ్చు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
AP Govt Partner With WhatsApp: టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వం పాలనలో మరో కీలక ముందడుగు వేసింది. ప్రభుత్వ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే ఒక్క వాట్సప్ ద్వారా చిటికెలో ప్రభుత్వ సేవలు పొందవచ్చు. ఈ మేరకు వాట్సప్ మాతృ సంస్థ అయిన మెటాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని నారా లోకేశ్ ప్రకటించారు.
Also Read: Drone Show: డ్రోన్ల రాజధానిగా అమరావతి.. దానికే నేనే బ్రాండ్ అంబాసిడర్: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు పౌర సేవల్ని వాట్సాప్ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సేవలను అందించేందుకు మెటా సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ప్రభుత్వ సేవలన్నీ ఒక్క ఫోన్‌తో పొందే వీలు దక్కుతుంది. ప్రభుత్వం అందించే సేవల్లో అత్యధిక భాగం వాట్సాప్ ద్వారానే ప్రజలకు చేరువలో ఉండనున్నాయి. సర్టిఫికెట్లు మంజూరు దగ్గర నుంచి చిన్న చిన్న పనులకు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సప్ సేవలు దోహదం చేయనున్నాయి.
Also Read: YS Jagan: బాధితులకు వైఎస్ జగన్ భరోసా.. రేపు గుంటూరు, కడప జిల్లాలో పర్యటన
అధికారంలోకి రాకముందు యువగళం పాదయాత్ర చేపట్టిన నారా లోకేశ్ ఆ సమయంలో విద్యార్థులు, యువత నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. కుల, ఆదాయం తదితర ధ్రువపత్రాలు పొందడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని.. కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని నాడు లోకేశ్‌కు వివరించారు. యువత ఫిర్యాదును దృష్టిలో ఉంచుకున్న లోకేశ్ తాజాగా మెటాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సమయం వృథా కాకుండా సర్టిఫికెట్లు అందేలా వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లతో సహా ఇతర పౌరసేవలు అందేలా చూడాలని నిర్ణయించారు.
ఈ క్రమంలోనే ఢిల్లీలో మెటా సంస్థతో చర్చలు జరిప్పి నారా లోకేశ్ ఒప్పందం చేసుకున్నారు. మెటా సంస్థ ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధం కావడంతో ఒప్పందం కుదరడంతో ఏపీ ప్రభుత్వ సేవలు వాట్సప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. వీలైనంత త్వరగా మెటా చాట్ బాట్ సేవల ద్వారా సేవల అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వాట్సప్ ద్వారా సేవలు ఎలా పొందవచ్చునో త్వరలో అవగాహన కల్పించే అవకాశం ఉంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తుండడంతో విద్యార్థులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి