Divyavani Resign: ఒంగోలులో జరిగిన మహానాడు విజయవంతం అయిందనే జోష్ లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి ఫైర్ బ్రాండ్ లీడర్ రిజైన్ చేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికార ప్రతినిధి దివ్యవాణి ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆమె తన రాజీనామా ప్రకటన చేశారు. తెలుగు దేశంలోని కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి తన ట్వీట్ లో తెలిపారు. ఇంత వరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు అంటూ ఆమె ట్వీట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దివ్యవాణి రాజీనామా ప్రకటన తెలుగుదేశం పార్టీలో సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో దూకుడుగా వెళుతున్నారు దివ్యవాణి. వైసీపీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. తన వాయిస్ తో కొద్ది కాలంలోనే టీడీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా గుర్తింపు పొందారు. ఒంగోలు మహానాడు లో తనకు ఘోర అవమానం జరిగిందని.. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని దివ్యవాణి సోమవారం ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. టీడీపీ కోసం తాను ఎంతగానో కష్టపడుతున్నా తనకు పార్టీలో సరైన గుర్తింపే లేదని ఆ ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక క‌ళాకారుడు పెట్టిన పార్టీలో.. తనలాంటి క‌ళాకారుల‌కు స్థానం లేక‌పోవ‌డంపై ఆమె ఆవేద‌న‌ వ్యక్తం చేశారు.



యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చంద్రబాబుపైనా తీవ్ర విమర్శలు చేశారు దివ్యవాణి. తెలుగుదేశం పార్టీలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయని చెప్పారు. పార్టీ కోసం కష్టపడినా తనను అవమానించారని కన్నీళ్లు కార్చారు.తన  శవాన్ని ముందుబెట్టి.. చంద్రబాబు ఓట్లు అడుక్కుంటారేమో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు దివ్యవాణి. పార్టీలో తనను అన్నివిధాలా అణిచివేశారని ఆరోపించారు. అధికారం లేని అధికార ప్రతినిధిగా మిగిల్చారని దివ్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు.మూడేళ్లుగా శ్రమిస్తున్నా మహానాడులో కనీసం మాట్లాడే అవకాశం లేకుండా చేశారన్నారు దివ్యవాణి. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆమె మాట్లాడిన మాటలను బట్టి.. దివ్యవాణి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని భావిస్తున్నారు.


READ ALSO: BANDI SANJAY: కేసీఆర్ సర్కార్ వేధింపులకు బయపడొద్దు.. ఆత్మహత్యలు చేసుకోవద్దు ! సర్పంచ్ లకు బండి సంజయ్ బహిరంగ లేఖ..


READ ALSO: Revanth Reddy: అమెరికాలో రేవంత్... హైదరాబాద్ లో భట్టీ మీటింగ్! కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook