Bike accident: తూర్పుగోదావరి జిల్లా(East godavari district)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్స్ ఢీకొని నలుగురు యువకులు మృతి చెందారు. రంపచోడవరం(Rampachodavaram) మండలం ఐ.పోలవరం కాలువ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Gang Rape: మహారాష్ట్రలో దారుణం...మైనర్‌ బాలికపై 400 మంది 6 నెలలుగా అత్యాచారం...


రంపచోడవరం సీఐ త్రినాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జాగరంపల్లి  గ్రామానికి చెందిన కోడి రమేశ్‌, కోసు శేఖర్‌లు సీతపల్లిలో జరిగిన ఓ పెళ్లి వేడుక(Marriage)కు హాజరై తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో గంగవరం మండలం జీఎం పాలెం గ్రామానికి చెందిన చోడి రాజబాబు, పండు అనే ఇద్దరు యువకులు రంపచోడవరం నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ రెండు వాహనాలు ఐ.పోలవరం కాలువ వద్ద  ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శేఖర్‌, రమేశ్‌, పండు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజబాబు మృతి చెందాడు. వీరంతా వ్యవసాయ కూలీలు. ప్రమాదఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు(Police) దర్యాప్తు చేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook