Somu Veerraju: బీజేపీలో జూనియర్ ఎన్టీఆర్ చేరనున్నారా..? సోమువీర్రాజు ఏమన్నారంటే..!
Somu Veerraju on NTR: బీజేపీకి సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దగ్గరవుతున్నారా..? అమిత్ షాను కలవడానికి గల కారణం అదేనా..? త్వరలో ఆ పార్టీ తరపున పనిచేయనున్నారా..? సోము వీర్రాజు కామెంట్స్ దేనికి సంకేతం..?
Somu Veerraju on NTR: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రజాదరణ ఉన్న వ్యక్తి అని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తమ అభిప్రాయం మారలేదన్నారు. కుటుంబ పార్టీలకు బీజేపీ దూరమని తేల్చి చెప్పారు. అందరూ నటులేనని..అందరికీ రాజకీయాలు చేయడం వచ్చు అని స్పష్టం చేశారు.
ఈసందర్భంగా ఏపీ పోలీసుల తీరుపై ఆయన ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి పోలీసులు తాబేదారులా మారారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్ట్రీట్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ సమావేశాలు ఉంటాయని తెలిపారు సోమువీర్రాజు. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా వచ్చారు. ఈసందర్భంగా శంషాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆయనను ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కలిశారు.
అమిత్‌షాతో కలిసి డిన్నర్ చేయడంతోపాటు ప్రత్యేకంగా 45 నిమిషాలపాటు ఏకకాంతంగా సమావేశం అయ్యారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిపారు. త్వరలో ఆర్ఎస్ఎస్‌పై సినిమా తీయనుండటంతో దాని గురించి చర్చించనట్లు ప్రచారం జరిగింది. ఐతే అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి చర్చించినట్లు బీజేపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో తిష్ట వేయాలని భావిస్తున్న కమలం పార్టీ..అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తోంది. సినీ రంగ ప్రముఖులను తమ వైపు తిప్పుకుంటోంది. ఇటీవల తెలంగాణకు వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్, సినీనటుడు నితిన్ భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు అంగీకారం చెప్పినట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. త్వరలో మరికొంత మంది స్టార్లు తమవైపు వస్తారని అంటున్నారు.
మరోవైపు బీజేపీకి సినీ ప్రముఖులు దగ్గరవుతుండటంతో టీఆర్ఎస్ సర్కార్ వారికి చెక్ పెడుతోంది. ఇటీవల బ్రహ్మాస్త్రం ప్రి-రిలీజ్‌కు కావాలనే అనుమతి ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది. ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ వెళ్తున్నారని తెలిసే..ఇలా చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి ఊతం ఇచ్చేలా బండ్ల గణేష్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి.
Also read:iBomma One More Shock: మళ్లీ షాకిచ్చిన ఐబొమ్మ.. ఇక అలా చూడడం కుదరదట!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి