టీడీపీ, వైసీపీలు ఈ రోజు సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ పకడ్బందీ వ్యూహంతో ఎదుర్కొందని పలువురు అంటున్నారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తూ బీజేపీ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుందని.. అవిశ్వాసంపై చర్చకు అనుమతి ఇస్తూనే వాటిపై చర్చ జరగకుండా జాగ్రత్తలు తీసుకుందన్నది కొందరు రాజకీయవేత్తల అభిప్రాయం. ఈ క్రమంలో బీజేపీ అనుసరించిన వ్యూహం గురించి.. అవిశ్వాసాన్ని ఆ పార్టీ ఎలా హ్యాండిల్ చేసిందని వస్తున్న వార్తల గురించి  వివరంగా పరిశీలన చేద్దామా మరి...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీజేపీని తెగ ఇబ్బంది పెడుతున్న అంశం తెలుగు ఎంపీలు అవిశ్వాస తీర్మానమే అన్నది జగమెరిగిన సత్యం. దాన్నుంచి బయటపడేందుకు అన్ని మార్గాలు అన్వేషించిన కమలనాథులు ...టీఆర్ఎస్, అన్నాడీఎంకేలపై గురిపెట్టి సమస్య నుంచి ఈజీగా బయటపడ్డారని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి టీఆర్ఎస్, అన్నాడీఎంకేలు ఏపీకి ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్నాయని... ఈ అంశానికి సంబంధించిన  అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే ఈ పార్టీలు ఎలాగూ అడ్డుకుంటాయని.. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించి  విమర్శల పాలవ్వడం ఎందుకని  మోడీ టీం ఆలోచించినట్లు పలువురు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 


బీజేపీ అనుకున్నట్లే ఉదయం సభ ప్రారంభమయ్యాక.. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా టీఆర్ఎస్, అన్నాడీఎంకేలు అవిశ్వాసాన్ని వ్యతిరేకించిన భావన సభలో కలిగింది. అవిశ్వాసానికి సంబంధించిన అంశం చర్చకు అనుమతి లభించిన వెంటనే  తమ ప్రాంతానికి సంబంధించిన అంశాలను ఆయా పార్టీలు తెరపైకి తెేవడంతో ఆశ్చర్యపోవడం ఎంపీ పనైంది. అవిశ్వాసం ప్రవేశపెట్టిన సందర్భంలోనే ఈ అంశాలపై వారు కూడా చర్చకు పట్టుబడ్డారు. దీంతో సభలో  గందరగోళ పరిస్థితి నెలకొనడంతో.. ఫలితంగా సభను వాయిదా వేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.


ఇలా తాజా పరిణామాలను చక్కగా వినియోగించుకొని అవిశ్వాస గండం నుంచి తాత్కాలికంగా బీజేపీ బయటపడిందని.. ఇదే సందర్భంలో అవిశ్వాసానికి అడ్డుపడ్డాయని టీఆర్ఎస్, అన్నాడీఎంకేలను విమర్శల పాలు చేయడంలో  బీజేపీ సక్కెస్ అయ్యిందని కొందరు సీనియర్లు చెవికోసుకోవడం గమనార్హం. ఇలా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న రీతిలో వ్యూహాన్ని అమలు చేసింది బీజేపీని అని వారు అంటున్నారు. 


బీజేపీ వ్యూహం వెనుక 
ప్రస్తుత తరుణంలో బీజేపీని గట్టిన వ్యతిరేకిస్తున్న పార్టీలు టీడీపీ,టీఆర్ఎస్ పార్టీలు అని కొందరు అంటున్నారు. ఈ సందర్భంలో బీజేపీని ఓడించేందుకు ఏకతాటిపై వస్తే బీజేపీకి మరిన్ని ఇబ్బందులు తప్పేటట్లు లేవనే వార్త కూడా హల్చల్ చేస్తుంది. కాబట్టి ఈ రెండు తెలుగు పార్టీలు ఐక్యం కాకూడదనే వ్యూహంతో.. వీరిద్ధరిని చెరోదారిలో పెట్టడంలో బీజేపీ సక్సెస్ అయిందనే చెబుతున్నారు. అయితే రేపటి సమావేశాల్లో అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ తప్పకుండా ఎదుర్కొవాల్సిందే. రేపు కూడా ఇదే వ్యూహం పనిచేస్తుందనేది కొందరి డౌట్ .. ఎందుకంటే బీజేపీ వ్యూహాన్ని ఇప్పటికే పసిగట్టిన టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు సరికొత్త వ్యూహంతో సభకు వస్తాయన్నది పలువురి వాదన. ఆ పార్టీలు అమలు చేసే వ్యూహాలు పనిచేస్తాయా లేదా మళ్లీ బీజేపీయే పైచేయి సాధిస్తుందా అనేది రేపటి సమావేశాల్లో తేలనుంది.