Rajya Sabha: కృష్ణయ్యకు బీజేపీ బంపరాఫర్.. రాజ్యసభకు నామినేట్ చేసిన కాషాయ దళం..
R Krishnaiah as Rajya Sabha: దేశ వ్యాప్తంగా పలు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. . తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు లోక్ సభకు ఎన్నిక కావడంతో పాటు పలువురు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాజ్యసభకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
R Krishnaiah as Rajya Sabha: దేశ వ్యాప్తంగానే కాదు.. ఏపీలో మాత్రం వైసీపీ రాజ్యసభ ఎంపీల రాజీనామాతో రాజ్య సభకు ఎన్నిక అవివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రాజ్యసభ అభ్యర్ధులను ఖారారు చేసింది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ నుంచి బీద మస్తాన్ రావ్, సానా సతీష్‌ను రాజ్యసభకు ఎంపిక చేసారు. సానా సతీష్.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు. గత ఎలక్షన్స్ లో కాకినాడ నుంచి ఆయన పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. తీరా ఉదయ్ శ్రీనివాస్ కు జనసేప పార్టీ టికెట్ ఇచ్చింది.
అటు ఆంధ్ర ప్రదేశ్ లో ఖాళీగా ఉన్న మూడో రాజ్యసభ స్థానం పొత్తులలో భాగంగా బీజేపీకి దక్కింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం వైసీపీకీ రాజీనామా చేసిన ఆర్. కృష్ణయ్యను తిరిగి బీజేపీ తరుపున రాజ్యసభకు పంపుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆయన పేరును ఖరారు చేస్తూ లేఖ విడుదల చేసింది.
ఆయనతో పాటు హర్యానాతో పాటు ఒడిషాలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. హర్యానా నుంచి రేఖా శర్మను ఖరారు చేస్తే..ఒడిషా నుంచి సుజిత్ కుమార్ ను ఎంపిక చేసింది. ఈ ముగ్గరు అభ్యర్ధులతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి ఎలాంటి పోటీ లేకుండా రాజ్యసభ సభ అభ్యర్థులు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ముగ్గురే అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నారు. ఏపీలో రాజ్యసభ ఎన్నిక లాంఛనం కానుంది. ఇక వైసీసీకి రాజ్యసభ సభ్యులను గెలిపించుకునే సంఖ్యా బలం లేకపోవడంతో పోటీ చేయడం లేదు. ఇక తెలుగు దేశం ఆవిర్భావం నుంచి రాజ్యసభలో తెలుగు దేశం పార్టీకి చెందిన ఏదో ఒక అభ్యర్ధి ఉండేవారు. కానీ గత రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో పెద్దల సభలో టీడీపీ సభ్యత్వం లేకుండా పోయింది. తాజాగా ఈ ఉప ఎన్నికతో మళ్లీ రాజ్యసభలో టీడీపీ ప్రస్థానం తిరిగి మొదలుకానుంది.
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.