ఏపీలో ఎన్నికల ముగిసిన నేపథ్యంలో తమిళనాడు, కర్నాటక రాజకీయాలపై దృష్టిసారించిన చంద్రబాబు.. బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు పై  బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ అభివృద్ధిని అడ్డుకునే పార్టీలతో చంద్రబాబు జతకడుతున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ విమర్శించారు. ప్రత్యేక హోదాకు మద్దతిస్తామని స్టాలిన్ చెప్పారా? ...కర్ణాటక సీఎం కుమారస్వామి మద్దతు ఇచ్చారా? ... హోదాకు వారు మద్దతు ప్రకటించనప్పుడు వారిని ఎందుకు సమర్థిస్తున్నారు? అని ప్రశ్నించారు.  


వాస్తవానికి ఏపీ ప్రయోజనాలకు అడ్డుపడుతోంది చంద్రబాబే అంటూ జీవీఎల్ దయ్యబట్టారు..హోదా విషయంపై జగన్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతిస్తే తప్పుబట్టిన చంద్రబాబు ...రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డపడే స్టాలిన్, కుమారస్వామిలకు ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని  ఈ సందర్భంగా జీవీఎల్ డిమాండ్ చేశారు.