న్యూ ఢిల్లీ: బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఫిబ్రవరి 7న తమ కుమారుడు రిత్విక్ వివాహం జరగనున్న నేపథ్యంలో ఆ వివాహ వేడుకకు రావాల్సిందిగా ప్రధాని మోదీని సీఎం రమేశ్ ఆహ్వానించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ మధ్యాహ్నం ప్రధాని కార్యాలయానికి వెళ్లిన సీఎం రమేశ్.. అక్కడే ప్రధాని మోదీని కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసి ఆహ్వానం పలికారు. ఇటీవలే ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో దుబాయ్‌లో రిత్విక్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. రిత్విక్ - పూజల నిశ్చితార్థానికి పలువురు ఎంపీలతో పాటు టీడీపీ, బీజేపీ, వైసీపీ నేతలు కూడా హాజరయ్యారు. 


ఫిబ్రవరి 7వ తేదీ మరెంతో దూరంలో లేకపోవడంతో త్వరలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులను సీఎం రమేష్ ఆహ్వానించనున్నారని సమాచారం అందుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..