ప్రముఖ మొబైల్‌ సంస్థ బ్లాక్‌బెర్రీ సరికొత్త ఫూచర్స్ తో కూడిన మొబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. తొలిసారిగా డ్యూయల్‌ కెమెరాల ఫ్యూచర్ కలిగిన  ‘బ్లాక్‌బెర్రీ కీ2’ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేయడం గమనార్హం. కాగా ఈ నెల 31 నుండి అమెజాన్‌ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు బ్లాక్‌బెర్రీ సంస్థ ప్రకటించింది. దీనికి రూ.4 వేల 450 విలువ గల క్యాష్‌బ్యాక్‌  జియో సంస్థ ఆఫర్‌ ప్రకటించింది. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డు ఉపయోగించి 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ని పొందవచ్చు. బ్లాక్‌బెర్రీ - జియో టైఅప్ అయిన ఈ ఫోన్ ఫీచర్స్ పై కస్టమర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బ్లాక్‌బెర్రీ కీ2’ పేరిట తాజాగా భారత మార్కెట్లోకి విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ గురించి ఒక్కసారి తెలుసుకుందామా....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘బ్లాక్‌బెర్రీ కీ2’ మొయిన్ ఫీచర్స్ ఇవే :
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
* 6 జీబీ ర్యామ్, 64/128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 
* 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా
* 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4.5 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే
* క్వెర్టీ ఫిజికల్‌ కీబోర్డు
* ఆక్టాకోర్ స్నాప్‌ డ్రాగన్ 660 ప్రాసెసర్
* 1620 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీఈ
*  ఫింగర్‌ప్రింట్ సెన్సార్
*  3500 ఎంఏహెచ్ బ్యాటరీ
* 4K వీడియో రికార్డింగ్


‘బ్లాక్‌బెర్రీ కీ2’కి సంబంధించిన మరిన్ని ఫీచర్స్ కోసం సంబంధిత వెబ్ సైట్  చూడగలరు....