హైదరాబాద్: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం మరో సరికొత్త ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ కింద రూ. 689 టారిఫ్‌తో 180 రోజుల కాలపరిమితితో 200 జీబీ డేటా అందిస్తోంది. అయితే, ఈ ప్లాన్‌లో వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉండవు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ప్లాన్.. నవంబర్ 18 తర్వాత ఎక్స్‌పైర్ కానుందని తెలుస్తోంది. 


వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు అవసరం లేకుండా.. ఇంటర్నెట్ డేటా మాత్రమే కావాలనునే వారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుందని బీఎస్ఎన్ఎల్ అధికార వర్గాలు తెలిపాయి.