హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ దేశ ప్రజలకు అన్యాయం చేసే విదంగా ఉందని, ఆర్థిక మాంద్యాన్ని అధిగమించే విదంగా బడ్జెట్ లో అంశాలు లేవని కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మండిపడ్డారు. ఇది ప్రజావ్యతిరేక, దేశ వ్యతిరేక బడ్జెట్ గా ఉందని, కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం జరిగిందని అయ్యాను అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 రాష్ట్రాల హక్కుల కోసం ఏపీ, తెలంగాణ సీఎంలు ఫెడరల్ స్ఫూర్తి కోసం ముందుకు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ నేతలు గాంధీపై చేసిన విమర్శలు సరైనది కాదని, దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమంలో గాంధీ చేసి కృషి వెలకట్టలేనిదని ఆయన అన్నారు.
నిరసన కారులను కాల్చి చంపాలని బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, CAA పై తెలంగాణ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించడాన్ని స్వాగతించారు. NPR ను అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో సీపీఎం పోటీ చేస్తోందని అన్నారు.


మరోవైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..  CAA-NPR-NRC కి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం మంచి పరిణామమని, CAA అమలు కోసం సిబ్బందిని కేటాయించబోమని తీర్మానం చేసి ప్రకటన చేయాలని ఆయన అన్నారు. CAA కి వ్యతిరేకంగా ఇంటింటి కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నామని, మార్చ్ 16 నుంచి 23 వరకు కార్యక్రమం ఉంటుందని, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు చాలా అన్యాయం జరిగిందని అన్నారు. విభజన హామీల అమలు గాలికి వదిలేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు పెండింగ్ లో ఉందని, సహకార సంఘం ఎన్నికలు పారదర్శకంగా జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..