CBI Raids: ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు, కొనసాగుతున్న సోదాలు
వివాదాస్పద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది. బ్యాంకు రుణాల బకాయిలపై కేసు నమోదు చేసి..సోదాలు నిర్వహించింది.
వివాదాస్పద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ( Ysr congress party mp ) రఘురామ కృష్ణంరాజు ( Raghurama krishnam raju ) పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది. బ్యాంకు రుణాల బకాయిలపై కేసు నమోదు చేసి..సోదాలు నిర్వహించింది.
సొంతపార్టీపై, ప్రభుత్వ విధానాలపై, పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకు దూరంగా ఉన్న నర్శాపురం వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు పూర్తిగా ఇరకాటంలో పడ్డారు. ఓ వైపు ఆదాయపన్నుశాఖ దాడులు జరుగుతుండగానే...సీబీఐ సోదాలు ( CBI Raids ) ప్రారంభమయ్యాయి. బ్యాంకు రుణాల బకాయిలకు సంబంధించిన ఆయనపై సీబీఐ కేసు ( CBI Case ) నమోదు చేసింది. హైదరాబాద్ లోని ఆయన నివాసంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నెల 6 వ తేదీన హైదరాబాద్, ముంబై సహా 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రఘురామ కృష్ణంరాజు సహా 9 మందిపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు ఈ సోదాలు చేపట్టాయి. ఇందు, భారత్ కంపెనీ సహా 8 మంది డైరెక్టర్ల ఇళ్లలో కూడా తనిఖీలు జరిగాయి. ఉదయం నుంచి కొనసాగుతున్నసోదాల్లో పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
2019 ఏప్రిల్ 30న బ్యాంక్ లోన్ బకాయిల పడిన కేసులో సైతం హైదరాబాద్, భీమవరంలోని రఘురామకృష్ణంరాజు కంపెనీల్లో సోదాలు చేపట్టారు. వివిధ ప్రాజెక్ట్‌లకు సంబంధించి 600 కోట్ల వరకూ ఆయన రుణాలు తీసుకున్నారు. ఇక ఇందు, భారత్ పవర్ లిమిటెడ్‌కు సంబంధించి 947 కోట్ల మేర బ్యాంకులకు రుణాల ఎగవేతకు పాల్పడగా.. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్ల నుంచి 2 వేల 655 కోట్ల వరకూలోన్ తీసుకున్నారు. Also read: Ap Rain Alert: రానున్న మూడ్రోజుల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు