Shock for CBI officers: సీబీఐ అధికారులకు ఏపీ ఆర్‌ అండ్‌ బీ అధికారులు షాక్‌ ఇచ్చారు. వైఎస్ వివేకా కేసులో విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు ఆర్ అండ్ బి అతిథి గృహంలో అద్దెకు  అంటున్నారు. సీబీఐ అధికారులు అద్దెకు తీసుకున్న గదులను ఖాళీ చేయాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏడాదిన్నర నుంచి మూడు గదులను అద్దెకు తీసుకోని వివేకా హత్య కేసు  విచారణ కోసం ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఉంటున్నారు సీబీఐ అధికారులు. అయితే కడప జిల్లాలోని ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న కల్యాణోత్సవం నిర్వహిస్తారు. కల్యాణంలో పాల్గొనేందుకు కడపకు సీఎం జగన్‌ రానున్నారు. సీఎంతో పాటు పలువురు ప్రముఖులు ఒంటిమిట్టకు వస్తారు. దీంతో వారికి ఆ గదులు కేటాయించడానికి మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది.


అందువల్లే సీబీఐ అధికారులు అద్దెకు ఉంటున్న గదులను ఖాళీ చేయాలని కోరారు. సీబీఐ అధికారులను ఖాళీ చేయించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీవీఐపీలు, వీఐపీలు వచ్చినా సరిపడే అతిథి గృహాలు ఉన్నా ఖాళీ చేయించడమేంటనే దానిపై సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. 


Also Read: MIM Corporator: ఎస్సైపై అరుస్తూ వాగ్వాదం... రెచ్చిపోయిన మరో ఎంఐఎం కార్పోరేటర్


Also Read: Chinese Hackers: భారత పవర్​గ్రిడ్​పై చైనా హ్యాకర్ల దాడి.. ఆ దేశ ప్రభుత్వ అండతోనే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook