Pulivendula: సీఎం జగన్ నియోజకవర్గానికి కేంద్రం భారీ గిఫ్ట్..
సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మీదుగా నేషనల్ హైవేను 4 లైన్లుగా విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రోడ్ల విస్తరణ పనులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ లో తెలియజేశారు
Pulivendula: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింంది. పులివెందుల మీదుగా నేషనల్ హైవేను ఫోర్ లైన్లుగా విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.
కడప జిల్లా ముద్దనూరు నుంచి తొండూరు. పులివెందుల.. కదిరి.. ఓబులదేవరచెరువు.. గోరంట్ల పాలసముద్రం మీదుగా హిందూపురానికి ఉన్న రోడ్డును జాతీయ రహదారి-716జీగా గుర్తించారు. 2,700 కోట్లతో ఫోర్ లైన్‌గా విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.మొత్తం 167 కిలోమీట్ల ఈ హైవేను మూడు ప్యాకేజీల్లో విస్తరిస్తారు. మొదటగా ముద్దనూరు నుంచి గోరంట్ల వరకు 125 కిలో మీటలర్లు 2వేల కోట్లతో రెండు ప్యాకేజీల్లో విస్తరణ పనులు చేపట్టనున్నారు. రెండో దశలో గోరంట్ల నుంచి హిందూపురం వరకు 700 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు.
అనంతపురం జిల్లా పరిధిలోని ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు 32 కిలో మీటర్ల నేషనల్ హైవేను 342ని 401 కోట్ల రూపాయల వ్యయంతో రెండు లైన్‌లుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. రోడ్ల విస్తరణ పనులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. నేషనల్ హైవే-67లో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి కడప జిల్లా ముద్దనూరు వరకు ఫోర్ లైన్లుగా విస్తరించేందుకు 724.17 కోట్ల రూపాయల పనులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
Also Read: RCB vs KKR: స్వల్ప స్కోర్‌కే చాప చుట్టేసిన కోల్‌కతా.. లక్ష్య చేధనలో తడబడుతున్న బెంగళూరు..
Also Read: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ Vs లక్నోసూపర్ జెయింట్స్.. బోణి కొట్టేదెవరు..??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook